Kalpavruksha Vahanam : కల్పవృక్ష వాహనంపై శ్రీవారు
రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప
Kalpavruksha Vahanam : తిరుమల – పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన కళాకారులు అద్భుతంగా కళా ప్రదర్శనలు చేపట్టారు.
Kalpavruksha Vahanam Event Updates
ఉత్సవాలలో భాగంగా శ్రీ మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై(Kalpavruksha Vahanam) రాజమన్నార్ అలంకారంలో దర్శనం ఇచ్చారు భక్తులకు. వాహనం ముందు గజ రాజులు నడుస్తుండగా, భక్త జన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
ఇదిలా ఉండగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వ భూపాల వాహనంపై స్వామి వారు అభయం ఇచ్చారు శ్రీవారి భక్తులకు. ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవో సదా భార్గవి, సివిఎస్వో నరసింహ కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున భద్రతను పెంచింది. పోలీసులు రేయింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారు. నడక దారిన వచ్చే భక్తులకు చేతి కర్రలను ఏర్పాటు చేసింది.
Also Read : TTD Chairman : శ్రీవారి సేవకుల సేవలు ప్రశంసనీయం