Tirumala Kunkumarchana : ఘనంగా కుంకుమార్చన
శ్రీ కపిలేశ్వరాలయంలో వేడుక
Tirumala Kunkumarchana : తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా లక్ష కుంకుమార్చన సేవను నిర్వహించారు. శ్రావణ మాసంలో చివరి రోజు కావడంతో శ్రీ కామాక్షి అమ్మ వారికి అంగరంగ వైభవోపేతంగా కుంకుమ అర్చన చేపట్టారు.
Tirumala Kunkumarchana Viral
లక్ష కుంకుమార్చన సేవలో భాగంగా కామాక్షి అమ్మ వారికి గణపతి పూజ, పుణ్యాహవచనంతో ప్రారంభించారు. అమ్మ వారికి అర్చన జరిపించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల దాకా శ్రీ చంద్రశేఖర స్వామి, శ్రీ మనోన్మణి అమ్మ వారు పుర వీధుల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
భక్తులు పెద్ద ఎత్తన అమ్మ వారి కుంకుమార్చన సేవా కార్యక్రమానికి హాజరయ్యారు. భారీ ఎత్తున తరలి వచ్చిన భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏటా శ్రీ కామాక్షి అమ్మ వారికి లక్ష కుంకుమార్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
మరో వైపు టీటీడీ(TTD) చైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ప్రతి ఆలయానికి పూర్వ వైభవం తీసుకు వస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు చైర్మన్ భూమన.
Also Read : Rajinikanth : బాబుతో తలైవా భేటీ అబద్దం