Tirumala : ‘కొండెక్కి’న భక్తులు కోటి తిప్పలు
తిరుమలకు పోటెత్తిన భక్తజనం
Tirumala : కలియుగ దైవంగా భావించే తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమల(Tirumala) చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను దర్శించుకునేందుకు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో ఆశించిన స్థాయి కంటే అధికంగా రావడంతో తిరుమల భక్త సందోహంతో నిండి పోయింది.
ఇసుకేస్తే రాలనంతగా భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల ఓ మహా కుంభమేళాను తలపింప చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు రావడంతో ఎటు చూసినా గోవింద నామస్మరణే వినిపిస్తోంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే భారీ ఎత్తున ఆదాయం సమకూరింది.
ఇది ఓ రికార్డుగా పేర్కొంటోంది టీటీడీ(Tirumala) . పర్వదినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కానుకలు, నగదు సమర్పించుకున్నారు. దీంతో ఏకంగా దేవస్థానానికి ఊ. 7.68 కోట్లు సమకూరాయి. ఒక్క రోజే 70 వేల మందికి పైగా దర్శించుకున్నారు. 18 వేల 612 మంది తలనీలాలు సమర్పించుకున్నట్లు టీటీడీ ఇంఛార్జ్ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు .
గత ఏడాది 2022లో తిరుమలకు రూ. 1446 కోట్లు సమర్పించుకున్నారు. ఇక వైకుంఠ ద్వారా దర్శనం ఈనెల 11 వరకు కొనసాగుతుందని ఈవో స్పష్టం చేశారు.
వైకుంఠ ద్వార దర్శనం కోసం సామాన్యులకు ఎక్కువగా దర్శనం చేయిస్తున్నామని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి.
ఈ పది రోజుల పాటు ఎటువంటి సిఫారసు లేఖలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా మంత్రులు, ప్రోటోకాల్ ఉన్న వారు వస్తే వారికి దర్శనం చేయిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read : ఏకాదశి పర్వదినం పోటెత్తిన భక్తజనం