Tirumala Rush : తిరుమలలో పోటెత్తిన భక్తజనం ఆదాయం రూ. 4.19 కోట్లు
శ్రీవారిని దర్శించుకున్న 78,115 భక్తులు
Tirumala Rush : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని , అలివేలు మంగమ్మలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మొన్న ఒక్క రోజు కొంత భక్తుల రద్దీ తగ్గినా శనివారం కావడంతో ఉన్నట్టుండి భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఎక్కడ చూసినా భక్త బాంధవులే దర్శనం ఇచ్చారు. గోవిందా గోవిందా అనాధ రక్షక గోవిందా, ఆపద మొక్కుల వాడ గోవిందా అంటూ స్వామి వారిని స్మరించుకున్నారు భక్తులు.
Tirumala Rush Huge
తిరుమల గిరులు భక్తుల సందడితో అలరారింది. తిరుమలలో కొలువైన శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భావిస్తారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలువైపుల నుంచి భక్తులు తిరుమల కొండపైకి బాట పట్టారు.
నిన్న ఒక్క రోజు 78 వేల 115 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 38 వేల 243 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీనివాసుడికి నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 4.19 కోట్లు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
స్వామి వారి దర్శనం కోసం తిరుమలలోని 22 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.
Also Read : Uttam Kumar Reddy : పార్టీ మారుతానంటూ దుష్ప్రచారం