Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల – తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్తుల ర‌ద్దీతో నిండి పోయింది. రోజు రోజుకు భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో శ్ర‌మ కోర్చి శ్రీ‌వారిని ద‌ర్శించు కునేందుకు వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసింది.

Tirumala Rush with Devotees

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా తిరుమ‌ల‌ను భావిస్తారు భ‌క్త బాంధ‌వులు. ద‌ర్శ‌నానికి సంబంధించి చూస్తే నిన్న ఒక్క రోజే భ‌క్తులు శ్రీ‌నివాసుడి ద‌ర్శ‌నం కోసం పోటెత్తారు భ‌క్తులు. మొత్తం 72 వేల 104 మంది శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్నార‌ని టీటీడీ(TTD) కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు.

25 వేల 44 మంది స్వామి వారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించార‌ని పేర్కొన్నారు. ఇక నిత్యం స్వామి వారికి భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు వ‌చ్చింద‌ని తెలిపారు.

స్వామి వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తుల క్యూ లైన్ కొన‌సాగుతోంది. ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు సంబంధించి ద‌ర్శ‌న స‌మ‌యం 6 గంట‌ల‌కు పైగా ప‌డుతుంద‌ని టీటీడీ స్ప‌ష్టం చేసింది.

Also Read : Congress Party Slams : ఆ మూడు పార్టీలు ఒక్క‌టే

Leave A Reply

Your Email Id will not be published!