Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లు
శ్రీవారిని దర్శించుకున్న 69, 378 మంది భక్తులు
Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. గత 60 రోజులకు పైగా ప్రతి రోజూ శ్రీనివాసుడిని 75 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజు మాత్రం ఆ సంఖ్య 70 వేలకు తగ్గింది. అయినా శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం మూడున్నర కోట్లకు పైగా రావడం విశేషం.
Tirumala Rush With Devotees
ఇక శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలమ్మను 69 వేల 378 మంది దర్శించుకున్నారు. స్వామికి మొక్కులు తీర్చుకునేందుకు గాను 28 వేల 371 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్ధానం (TTD) వెల్లడించింది.
ఇక స్వామి వారి దర్శనం కోసం తిరుమల లోని 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలగాలంటే 12 గంటలకు పైగా పడుతుందని పేర్కొంది టీటీడీ.
ఓ వైపు బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా భక్తుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.
Also Read : OTT Web Series Comment : హద్దులు దాటుతున్న వెబ్ సీరీస్