Tirumala Rush : శ్రీవారి ఆదాయం రూ. 4.60 కోట్లు
దర్శించుకున్న భక్తులు 64,695
Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న శ్రీనివాసుడిని 64 వేల 695 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 473 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.60 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
Tirumala Rush with Huge People
స్వామి వారి దర్శనం కోసం తిరుమల లోని 11 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 16 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.
ఇదిలా ఉండగా తిరుమలకు కాలి నడకన శ్రీవారి మెట్లు, అలిపిరి దారిన వచ్చే భక్తులకు గట్టి భద్రత ఏర్పాటు చేసినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించడాన్ని తప్పు పట్టారు.
అటవీ శాఖ చేసిన సూచనల మేరకే టీటీడీ కాలి నడకన వచ్చే భక్తులకు చేతి కర్రలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అంతే కాకుండా కాలి నడకన వచ్చే భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు గాను 100 మందికి పైగా సెక్యూరిటీ గార్డులను నియమించడం జరిగిందన్నారు.
Also Read : Gangavaram Port Comment : గంగవరం ఓడ రేవుకు దిక్కేది