Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు
దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,757
Tirumala Rush : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్తుల రద్దీతో కొనసాగుతోంది. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు. ప్రస్తుతం ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఈసారి కూడా తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).
Tirumala Rush with Devotees
భారీ ఎత్తున ఏర్పాట్లను చేసింది పాలక మండలి. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 66 వేల 757 మంది భక్తులు దర్శించుకున్నారు. 26 వేల 395 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు ప్రతి రోజూ సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) స్పష్టం చేసింది.
తిరుమలలో భక్తుల దర్శనం కోసం 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. ఇదిలా ఉండగా నడక దారి నుండి వచ్చే భక్తులకు సంబంధించి చేతి కర్రలను ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు. వసతి సౌకర్యాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
Also Read : Jagadish Shettar : కన్నడ కాంగ్రెస్ లో షెట్టర్ కలకలం