Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.24 కోట్లు

స్వామి వారిని ద‌ర్శించుకున్న భ‌క్తులు 67,728

Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌లో శ్రీనివాసుడిని ద‌ర్శించుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందే త‌ప్పా త‌గ్గ‌డం లేదు. మంగ‌ళ‌వారం 67 వేల 728 మంది భ‌క్తులు స్వామిని ద‌ర్శించుకున్నారు. ఎప్ప‌టి లాగే త‌ల నీలాలు స‌మ‌ర్పించుకునే వారి సంఖ్య 21 వేల 84 మందికి చేరుకుంది. ఇక భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 4.24 కోట్ల‌కు చేరుకుంది.

Tirumala Rush Huge

ఇక తిరుమ‌ల లోని 5 కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు స్వామి ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకునేందుకు 12 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) వెల్ల‌డించింది.

మ‌రో వైపు సుదూర ప్రాంతాల నుంచి స్వామి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసినట్లు టీటీడీ చైర్మ‌న్ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా శ్రీ‌వాణి ట్ర‌స్టుపై తాము పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. తిరుమ‌ల ప్రెస్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన నిజ నిర్ధార‌ణ క‌మిటీని సైతం తాము ఆహ్వానిస్తున్న‌ట్లు పేర్కొన్నార‌ను చైర్మ‌న్. ప్ర‌తి పైసాకు లెక్క రాసి పెట్టామ‌ని ఎవ‌రైనా స‌రే , ఎప్పుడైనా స‌రే వ‌చ్చి చూసుకోవ‌చ్చంటూ స్ప‌ష్టం చేశారు. ఇలాంటి నిరాధార ఆరోప‌ణ‌లు పుణ్య క్షేత్రంపై , ట్ర‌స్టుపై చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు.

Also Read : Ambati Rambabu BRO Movie : బ్రో సినిమాపై అంబ‌టి ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!