Tirumala Rush : తిరుమ‌ల క్షేత్రం పోటెత్తిన భ‌క్తజ‌నం

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. శ్రీ‌వారిని ద‌ర్శించు కునేందుకు భ‌క్తులు బారులు తీరారు. ఎక్క‌డ చూసినా గోవింద నామ స్మ‌ర‌ణ‌తో నిండి పోయింది. గోవిందా గోవిందా అనాధ ర‌క్ష‌క గోవిందా, ఆప‌ద మొక్కుల వాడా గోవిందా అంటూ భ‌క్తులు స్వామి ద‌ర్శ‌న భాగ్యం కోసం వేచి చూశారు.

Tirumala Rush with Devotees

నిన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 72 వేల 696 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. స్వామి వారికి 27వేల 60 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. ఇక భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు వ‌చ్చింద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) వెల్ల‌డించింది.

ఇక స్వామి వారి ద‌ర్శ‌నం కోసం తిరుమ‌ల లోని నాలుగు కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నార‌ని పేర్కొంది. ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు స్వామి ద‌ర్శ‌న భాగ్యం క‌లిగేందుకు క‌నీసం 12 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని టీటీడీ వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల‌లో సామాన్య భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు అన్న‌వి లేకుండా చూస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. వ‌స‌తి సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు అత్య‌ధిక ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు తెలిపారు టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి.

Also Read : CM KCR Tour : సెప్టెంబ‌ర్ 8న కేసీఆర్ టూర్

Leave A Reply

Your Email Id will not be published!