Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు
స్వామి వారిని దర్శించుకున్న భక్తులు 57,443
Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమలలో కొలువై ఉన్న శ్రీనివాసుడిని, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కునేందుకు భక్తులు బారులు తీరారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు. ఇదే సమయంలో పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానానికి(TTD) గణనీయంగా హుండీ ఆదాయం రూపేణా సమకూరుతోంది.
Tirumala Rush With Huge People
తాజాగా శ్రీ వేంకటేశ్వర స్వామిని గురువారం 57 వేల 443 మంది దర్శించుకున్నారు. ఇక ఎప్పటి లాగే భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు వచ్చాయని టీటీడీ స్పష్టం చేసింది.
స్వామి వారికి మొక్కులు తీర్చుకుని తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 28 వేల 198 మందికి చేరిందని వెల్లడించింది. తిరుమల లోని కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వద్ద వరకు క్యూ లైన్ లు ఉన్నాయని తెలిపింది. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం స్వామి , అమ్మ వార్ల దర్శన భాగ్యం కలవాలంటే 24 గంటలకు పైగా పట్ట వచ్చని టీటీడీ పేర్కింది.
తాజాగా టీటీడీ చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక నుంచి సామాన్యులకే ప్రయారిటీ ఇస్తానని స్పష్టం చేశారు. మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామి వారి సేవలో తరించినందుకు ధన్యుడినైట్లు తెలిపారు.
Also Read : Mahua Moitra : మోదీదే మణిపూర్ బాధ్యత – మహూవా