Tirumala Rush : తిరుమ‌ల‌లో భక్తుల ర‌ద్దీ

హుండీ ఆదాయం రూ. 4.23 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్ర‌సిద్ది చెందిన శ్రీ‌నివాసుడు, అలివేలుమంగ‌మ్మ‌లు కొలువైన పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. రోజు రోజుకు భ‌క్తుల ర‌ద్దీ పెరుగుతోందే త‌ప్పా త‌గ్గ‌డం లేదు. స్వామి వారిని 70 వేల 515 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

Tirumala Rush with Devotees

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి 27 వేల 230 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నార‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) వెల్ల‌డించింది. నిత్యం స్వామి వారికి స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం గ‌ణనీయంగా పెరిగింది.

తాజాగా హుండీ ఆదాయం ఏకంగా రూ.4.23 కోట్లు వ‌చ్చాయ‌ని టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి వెల్ల‌డించారు. ఎంతో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స‌క‌ల వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

శ్రీ‌వారి మెట్లు, అలిపిరి మెట్ల ద్వారా తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల భ‌ద్ర‌త‌పై ఫోక‌స్ పెట్టామ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర అట‌వీ శాఖ చేసిన సూచ‌న మేర‌కు చేతి క‌ర్ర‌ల‌ను అంద‌జేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఇక స్వామి వారి ద‌ర్శ‌నం కోసం తిరుమ‌ల‌లోని 2 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నార‌ని తెలిపారు. ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నానికి క‌నీసం 6 గంట‌ల‌కు పైగా ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.

Also Read : Meenakshi Lekhi : బీజేపీ వాలంటీర్లు జ‌ర్న‌లిస్టులు కావాలి

Leave A Reply

Your Email Id will not be published!