Tirumala Rush : కలియుగ పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత 75 రోజులుగా కనీ విని ఎరుగని రీతిలో భక్తుల తాకిడితో తిరుమల పులకించి పోయింది. ఎక్కడ చూసినా గోవిందా గోవిందా , శ్రీనివాసా గోవిందా , ఆపద మొక్కుల వాడా గోవిందా..అనాధ రక్షక గోవిందా అంటూ భక్త బాంధవులు స్మరించుకున్నారు.
Huge Rush in Tirumala
మొన్న కొద్ది పాటిగా భక్తుల సంఖ్య తగ్గినా ఉన్నట్టుండి నిన్న ఒక్క రోజే భక్తులు పోటెత్తడం విస్తు పోయేలా చేసింది. శ్రీవారికి సంబంధించి శనివారం కావడంతో 81 వేల 472 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామికి 34 వేల 820 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
ఇక స్వామి వారి దర్శనం కోసం తిరుమలలోని 23 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 18 గంటల సమయం పట్టనుందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. ఏ భక్తుడికి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని, నిర్ణీత సమయం కంటే ముందే దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మా రెడ్డి స్పష్టం చేశారు.
Also Read : Sherlyn Chopra Rahul : రాహుల్ ఓకే అంటే పెళ్లికి సిద్దం