Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల – తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్తుల‌తో నిండి పోయింది. శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి. మంగ‌ళ‌వారం రోజు నాటితో ముగుస్తాయి. ఈ సంద‌ర్బంగా స్వామి వారికి ఉద‌యం చ‌క్ర‌స్నానం నిర్వ‌హించారు.

Tirumala Rush with Devotees

గ‌త కొన్ని రోజులుగా భ‌క్తులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నారు తిరుమ‌ల‌కు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) స‌క‌ల ఏర్పాట్లు చేసింది. తాజాగా శ్రీ‌నివాసుడిని, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 72 వేల 137 మంది ద‌ర్శించుకున్నారు.

ఇక స్వామి వారికి 23 వేల 735 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. ప్ర‌తి రోజూ భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారికి స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3..37 కోట్ల ఆదాయం స‌మ‌కూరింద‌ని టీటీడీ వెల్ల‌డించింది.

భ‌క్తుల‌కు త్వ‌రిత‌గ‌తిన స్వామి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తోంది దేవ‌స్థానం పాల‌క మండ‌లి. ఇదే స‌మ‌యంలో ఆయా కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్న భ‌క్తుల‌కు నేరుగా ద‌ర్శ‌నం క‌లుగుతోంద‌ని టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి వెల్ల‌డించారు.

ఇక ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌లిగేందుకు క‌నీసం 8 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని టీటీడీ తెలిపింది.

Also Read : Chakrasnanam : అంగ‌రంగ వైభోగం చ‌క్ర స్నానం

Leave A Reply

Your Email Id will not be published!