Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లు
స్వామి వారిని దర్శించుకున్న భక్తులు 69,270
Tirumala Rush : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను దర్శించు కునేందుకు బారులు తీరారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్వామి వారిని నిన్న ఒక్కరోజు 69 వేల 270 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక స్వామికి 28 వేల 755 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీనివాసుడికి నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
Tirumala Rush News
తిరుమలలోని 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు దర్శన భాగ్యం కలిగేందుకు కనీసం 18 గంటల సమయం పడుతుందని పేర్కొంది తిరుమల తిరుపతి దేవస్థానం.
సుదూర ప్రాంతాల నుంచి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరికీ దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక డయల్ ఈవో కార్యక్రమంలో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి సేవకు సంబంధించి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
Also Read : Nara Lokesh : శ్రీవారిని కూడా వదలని వైకాపా