Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

రూ. 3.06 కోట్ల ఆదాయం

Tirumala Rush : తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు కొన‌సాగుతున్నాయి. 77 వేల 187 మంది భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్నారు.

Tirumala Rush with Devotees

29 వేల 209 మంది భ‌క్తులు త‌ల నీలాలు స‌మ‌ర్పించారు. శ్రీ‌వారికి నిత్యం భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 3.06 కోట్లు వ‌చ్చిన‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా ఈనెల 15 నుంచి శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. రోజుకో రూపంలో శ్రీ‌నివాసుడు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తున్నారు. ఉత్స‌వాలు అక్టోబ‌ర్ 23 వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు.

స్వామి వారి ద‌ర్శ‌నం కోసం తిరుమ‌ల లోని 12 కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తులకు క‌నీసం 8 గంట‌ల‌కు పైగా ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఈవో. మ‌రో వైపు ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని భ‌క్తుల‌కు ఎలాంటి సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నార‌నే దానిపై ఆరా తీశారు టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.

Also Read : Nara Lokesh : లేఖ రాయ‌డం కూడా నేర‌మేనా

Leave A Reply

Your Email Id will not be published!