Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
స్వామిని దర్శించుకున్న భక్తులు 80,551
Tirumala Rush : తిరుమల – పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. భారీ ఎత్తున తరలి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు ఈవో ఏవీ ధర్మా రెడ్డి తెలిపారు.
మరో వైపు భక్తుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు టీటీడీ(TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. నడక దారిన వచ్చే భక్తులకు ఇచ్చే చేతి కర్రలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్బంగా భక్తులతో సంభాషించారు.
Tirumala Rush with Huge Devotees
ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా నిన్న ఒక్క రోజు భక్తుల సంఖ్య 80 వేలకు పైగా దాటింది. మొత్తం శ్రీవారిని 80 వేల 551 మంది దర్శించుకున్నారు. స్వామి వారికి 32 వేల 28 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భారీ ఎత్తున స్వామి వారికి ఆదాయం సమకూరింది. నిత్యం భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్తానం తెలిపింది.
ఇదిలా ఉండగా తిరుమల లోని 22 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు దర్శనం దాదాపు 24 గంటలకు పైగా పడుతుందని టీటీడీ వెల్లడించింది.
Also Read : AP CM YS Jagan Tour : 5న జగన్ హస్తిన టూర్