Tirumala Rush : తిరుమలకు పోటెత్తిన భక్తులు
రూ.3.48 కోట్ల శ్రీవారి ఆదాయం
Tirumala Rush : తిరుమల – పుణ్య క్షేత్రమైన తిరుమల భక్త బాంధవులతో పోటెత్తింది. ఎక్కడ చూసినా భక్తుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి అష్ట కష్టాలు పడి శ్రీనివాసుడిని దర్శించు కునేందుకు విచ్చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసింది.
Tirumala Rush with Devotees
ఇక భక్తులకు శనివారం ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీవారిని 78 వేల 557 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 3.48 కోట్లు వచ్చాయని టీటీడీ(TTD) వెల్లడించింది.
శ్రీనివాసుడి దర్శనం కోసం తిరుమల లోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండి పోయాయి. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల లైన్ ఉంది. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా ఉన్న సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.
సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఉంటుందని , సకల సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెడుతున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఏవో ఏవీ ధర్మా రెడ్డి తెలిపారు.
Also Read : Chandrababu Naidu : బాబు అరెస్ట్ సిట్ విచారణ