Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ 4.08 కోట్లు
స్వామి వారిని దర్శించుకున్న 72,158 మంది భక్తులు
Tirumala Rush : కలియుగ దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా పేరు పొందిన తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతూనే ఉంది. భక్తుల సంఖ్య పెరిగింది. శుక్రవారం ఒక్క రోజే 72 వేల 158 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
శ్రీనివాసుడికి 30 వేల 735 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. ఇక భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 4.08 కోట్లు వచ్చాయని తెలిపింది.
Tirumala Rush With Huge People
ఇక శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకునే భక్తులు తిరుమల లోని 23 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారని పేర్కొంది. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 18 గంటల సమయం పడుతుందని స్పష్టం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
మరో వైపు టీటీడీ నూతన చైర్మన్ గా కొలువు తీరిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలను కల్పించడంపై ఫోకస్ పెడతామని తెలిపారు.
Also Read : TTD EO AV Dharma Reddy : తాళపత్ర పరిశోధన సంస్థ ఎదగాలి