Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.85 కోట్లు
Tirumala Rush : తిరుమల – పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చారు. తండోప తండాలుగా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేసింది.
సామాన్య భక్తులకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా తిరుమల శ్రీవారిని 77 వేల 441 మంది దర్శించుకున్నారు. 29 వేల 816 మంది భక్తులు శ్రీనివాసుడికి తలనీలాలు సమర్పించారని టీటీడీ వెల్లడించింది.
Tirumala Rush with Devotees
నిన్న ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగిందని టీటీడీ(TTD) ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. అయినా ఎక్కడా ఇబ్బంది లేకుండా చూశామని స్పష్టం చేశారు. ఇక నిత్యం శ్రీవారికి సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.85 కోట్ల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
మరో వైపు శ్రీనివాసుడి, శ్రీ అలివేలుమ్మలను దర్శించు కునేందుకు తిరుమలలో కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఇక ఎలాంటి శ్రీవారి టోకెన్లు లేకుండా ఉన్న భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్, ఈవో భూమన, ధర్మా రెడ్డి.
Also Read : TDP MP’s Protest : బాబు అరెస్ట్ పై ఎంపీల నిరసన