Tirumala Tirupati Tickets : తిరుమల భక్తులకు శుభవార్త ..! 27 న ఆన్లైన్ టిక్కెట్లు

Tirumala Tirupati Tickets : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేలాది భక్తులు పోటెత్తుతుంటారు. స్వామి వారి దర్శనం కోసం పడిగాపులు కాస్తుంటారు. అయితే ఈ నెల (మార్చి) 27న తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.

ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్ లైన్ లో(Tirumala Tirupati Tickets) అందుబాటులో ఉంటాయని ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.

తిరుమల శ్రీవారి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలంటే ముందుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం స్పెషల్‌ ఎంట్రీ దర్శన్‌ (ప్రత్యేక దర్శనం) ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి జనరేట్‌ ఓటీపీ (OTP)పై నొక్కాలి.

అలాగే జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అంగప్రదక్షిణం టోకెన్లను టీటీడీ ఇప్పటికే రిలీజ్ చేసింది. తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మరోవైపు మార్చి 24వ తేదీన ఉదయం పది గంటలకు తిరుమల స్వామివారి అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల అయ్యాయి.

దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది టీటీడీ(Tirumala Tirupati). భక్తుల కోరిక మేరకు వర్చువల్ సేవా టికెట్స్ ఆన్ లైన్ సేవలు కొనసాగించాలని నిర్ణయించింది. 

వేసవి కాలం మూడు నెలలపాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. వీఐపీ రెఫరల్స్ తగ్గించే అవకాశం ఉంది. శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడా తగ్గిస్తామని సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ వారికి దర్శనం కల్పిస్తామని టీటీడీ చెబుతోంది.

Also Read : యాదగిరిగుట్టలో ఘనంగా వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!