Dhwajarohanam TTD : గోవిందరాజస్వామి ధ్వజారోహణం
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Dhwajarohanam TTD : తిరుపతి లోని శ్రీ గోవింద రాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 8.22 నుండి 8.49 గంటల మధ్య మిధున లగ్నంలో శాస్త్రోక్తంగా ప్రారంభించారు. వేద పండితుల మంత్రోశ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామ స్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజ పట్టాన్ని ధ్వజ స్థంభంపై ప్రతిష్టించారు. అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది.
అంతకు ముందు శ్రీ గోవింద రాజ స్వామి ధ్వజ పటం, చక్రత్తాళ్వార్ , పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లును స్వామి వారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తు హోమం, గరుడ లింగ హోమం, గరుడ ప్రతిష్ట, రక్షా బంధనం చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవింద రాజ స్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం(Dhwajarohanam) చేపట్టారు.
18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, కంకణ భట్టార్ శ్రీ ఎపీ శ్రీనివాస దీక్షితులు, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు పాల్గొన్నారు.
Also Read : Karnataka Portfolios
