Tiruvannamalai : తిరువణ్ణామలైలో దీపోత్సవం
పోటెత్తిన భక్తజనం
Tiruvannamalai : తమిళనాడు – ప్రసిద్ది చెందిన , కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై పుణ్య క్షేత్రం. కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఆలయ పాలక మండలి.
Tiruvannamalai Event
2,668 అడుగుల ఎత్తున కొండపై దీపాన్ని ఇవాళ వెలిగించేందుకు చర్యలు చేపట్టారు. తమిళనాడు నుంచే కాకుండా కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కేరళ , తదితర రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తారు. ఇప్పటికే తిరువణ్ణామలైకి(Tiruvannamalai) భారీ ఎత్తున చేరుకుంటున్నారు.
దీపాన్ని వెలిగించడంలో కీలక పాత్ర పోషించనున్నారు సిబ్బంది. దీపం కోసం ఇప్పటికే లోహ పాత్ర తరలించారు. ఇదిలా ఉండగా దీపం వెలిగించేందుకు ఇప్పటికే 4,500 కిలోల నెయ్యిని ఏర్పాటు చేశారు. వత్తి కోసం ఏకంగా 1,200 మీటర్ల వస్త్రాన్ని వాడారు. సాయంత్రం ఆరు గంటలకు మహా దీప దర్శనం ఉంటుందని ఆలయ పాలక మండలి స్పష్టం చేసింది.
ఎక్కడ చూసినా భక్తులు దర్శనం ఇస్తున్నారు తిరువణ్ణామలై. అయితే 40 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తమిళనాడు డీఎంకే సర్కార్ భావిస్తోంది. భారీ ఎత్తున పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది.
Also Read : Revanth Reddy : కేసీఆర్..ఓవైసీపై రేవంత్ కామెంట్స్