Shashi Tharoor Manish Tiwari : అధ్యక్ష బరిలో తివారీ..శశి థరూర్
నేడే నామినేషన్ దాఖలుకు ఆఖరు
Shashi Tharoor Manish Tiwari : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ల తర్వాత గాంధీ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు లేకుండా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటికే తాము పోటీ చేయడం లేదంటూ ప్రకటించారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇక గాంధీ ఫ్యామిలీకి వీర విధేయులుగా ఉంటూ వచ్చిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , మాజీ సీఎంలు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ , ఎంపీ మల్లికార్జున్ ఖర్గే పోటీలో నిలిచారు. చివరి వరకు ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇక పార్టీలో మొదటి నుంచీ అసమ్మతి రాగం వినిపిస్తూ వచ్చిన జి2లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) తో పాటు మనీష్ తివారీ కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న తివారీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక తన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగుర వేయడంతో తాను బరిలో ఉండబోనంటూ ప్రకటించారు అశోక్ గెహ్లాట్.
ఇక దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో అసమ్మతి వర్గం నుంచి ఎవరు పోటీలో ఉండాలనే దానిపై జి-23 నాయకులు పృథ్వీరాజ్ చవాన్ , భూపిందర్ హుడా, మనీష్ తివారీ(Manish Tiwari) తో సహా పలువురు నాయకులు సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ నివాసంలో భేటీ అయ్యారు.
మరో వైపు శుక్రవారం పార్టీ అత్యున్నత పదవికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు శశి థరూర్. ఈ సందర్భంగా తివారీ మీడియాతో మాట్లాడారు. ఇంకా నామినేషన్లు ఎవరూ దాఖలు చేయలేదన్నారు. ఇవాళ ఎవరు పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వస్తుందన్నారు.
Also Read : కాంగ్రెస్ అన్నా చెల్లెలి పార్టీ – జేపీ నడ్డా