Partha Chatterjee : కేబినెట్ నుంచి పార్థ ఛ‌ట‌ర్జీ తొల‌గింపు

సీఎం మమ‌తా బెన‌ర్జీ సంచ‌ల‌న నిర్ణ‌యం

Partha Chatterjee : టీచ‌ర్ల స్కాంలో అరెస్ట్ అయిన‌ వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పార్థ ఛ‌ట‌ర్జీకి(Partha Chatterjee) కోలుకోలేని షాక్ ఇచ్చింది టీఎంసీ చీఫ్‌, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. పార్టీలో కీల‌క ప‌ద‌వుల‌తో పాటు కేబినెట్ నుంచి తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉండ‌గా ఈ స్కాంలో జూలై 23న మంత్రి పార్థ ఛ‌ట‌ర్జీతో పాటు ఆయ‌న అనుచ‌రురాలిగా పేరొందిన ప్ర‌ముఖ సినీ న‌టి అర్పితా ముఖ‌ర్జీని అదుపులోకి తీసుకుంది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ).

ఆమెకు చెందిన ఇళ్లు, ఫ్లాట్ ల‌లో ఏకంగా రూ. 50 కోట్ల న‌గ‌దు 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అధికారుల‌తో లెక్కించారు. మొత్తం మూడు యంత్రాల‌ను వినియోగించింది ఈడీ.

టీచ‌ర్ల భ‌ర్తీలో అవినీతికి పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌ల‌పై అరెస్ట్ చేసిన ఐదు రోజుల త‌ర్వాత పార్థ ఛ‌ట‌ర్జీని మంత్రి ప‌ద‌వితో పాటు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలోని అన్ని ప‌ద‌వుల నుండి సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తొల‌గించారు.

ఈ విష‌యాన్ని గురువారం టీఎంసీ అధికారికంగా ప్ర‌కటించింది. విచార‌ణ కొన‌సాగేంత వ‌ర‌కు పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు తెలిపింది. అత‌ను నిర్దోషి అని రుజువైతే త‌లుపులు తెరిచే ఉంటాయ‌ని టీఎంసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అభిషేక్ బెనర్జీ.

ఇదిలా ఉండ‌గా పార్థ ఛ‌ట‌ర్జీ 20 ఏళ్ల‌కు పైగా టీఎంసీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జాతీయ ఉపాధ్య‌క్షుడిగా నియ‌మితుల‌య్యారు.

మొత్తం దాడుల అనంత‌రం 10 ట్రంకు పెట్టెల‌తో ఈడీ బ‌య‌లు దేరింది. ఇది ఓ రికార్డు. ఒక ర‌కంగా దీదీకి షాక్.

Also Read : సోనియా గాంధీ ఉక్కు మ‌హిళ – రేణుకా

Leave A Reply

Your Email Id will not be published!