Suvendu Adhikari Mamata : బీజేపీ ర్యాలీ భగ్నానికి టీఎంసీ కుట్ర
రాష్ట్ర బీజేపీ అగ్ర నేత సువేందు అధికారి
Suvendu Adhikari Mamata : భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు సువేందు అధికారి(Suvendu Adhikari) షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపంచారు. ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టింది. అయితే దీనిని అడ్డుకునేందుకు టీఎంసీ విద్రోహ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయంటూ మండిపడ్డారు సువేందు అధికారి.
తమ ర్యాలీకి పూర్తిగా సెక్యూరిటీ కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఆదేశించిందన్నారు. కానీ ప్రభుత్వం కావాలని తమను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తోందంటూ ధ్వజమెత్తారు. బీజేపీ ర్యాలీని భగ్నం చేసేందుకు కుట్ర పన్నుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు సువేందు అధికారి. ఆరు నూరైనా తాము ర్యాలీని చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు.
సర్వోన్నత న్యాయస్థానం ర్యాలీకి సహకరించాలని ఆదేశించినా కావాలని అడ్డంకులు సృష్టించేందుకు యత్నిస్తే తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు శనివారం వీధుల్లోకి వస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా డైమండ్ హార్బర్ లో భారతీయ జనతా పార్టీ ర్యాలీని చేపట్టేందుకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ట్విట్టర్ అధికారికంగా ఈ విషయం గురించి పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు సువేందు అధికారి. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు, పోరాడే హక్కు ఉంటుందని సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) గుర్తించాలని అన్నారు.
ఇదిలా ఉండగా ర్యాలీలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని, సజావుగా సాగేలా లా అండ్ ఆర్డర్ ను పాటించాలని హైకోర్టు సూచించింది.
Also Read : పరేష్ రావల్ పై మహూవా కన్నెర్ర