Suvendu Adhikari : సువేందు అధికారిని అరెస్ట్ చేయాలి
తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్
Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్ లో శారదా స్కాం కలకలం రేపింది. ఈ కుంభకోణంలో శారద యజమాని సుదీప్తో సేన్ సంచలన ఆరోపణలు చేశారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి(Suvendu Adhikari) పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
తనను బ్లాక్ మెయిల్ చేసి తన నుండి డబ్బు తీసుకున్నట్లు ఆరోపించాడు. దీంతో సుదీప్తో సేన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో వెంటనే బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు సువేందు అధికారిని అరెస్ట్ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు.
సీబీఐ ఆలస్యం చేయకుండా వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని కోరారు. శారదా స్కాం అసలు కుట్రదారులు తప్పించు కునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే సువేందు అధికారి తనను తాను రక్షించుకునేందుకు భారతీయ జనతా పార్టీలో చేరారని మండిపడ్డారు.
శారదా కుంభకోణం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శారద, నారద స్కాం కేసులు కొనసాగుతున్నాయి. సీబీఐ, ఈడీ అరెస్ట్ చేయాలని కోరుతూ లేఖలు పంపించినట్లు తెలిపారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సువేందు అధికారి(Suvendu Adhikari) మామూలోడు కాదు. ఆయన ప్రభావంతమైన కుట్రదారుడిగా పేర్కొన్నారు. వివిధ పార్టీలను ఉపయోగించు కున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం తర్వాత గత ఏడాది జూన్ లో బీజేపిని వీడి పార్టీలో చేరిన ముకుల్ రాయ్ పై తాజా వివాదం రేగింది.
Also Read : మోదీ..రాజ్ నాథ్ కు సిన్హా ఫోన్