Idris Ali Modi : భారత్ లో శ్రీలంక అధ్యక్షుడి సీన్
సంచలన కామెంట్స్ చేసిన టీఎంసీ
Idris Ali Modi : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. ఒంటెత్తు పోకడలు పోతూ , అధికారం ఉంది కదా అని బీజేపీయేతర రాష్ట్రాలు, వ్యక్తులు, సంస్థలను టార్గెట్ చేస్తూ వస్తుండడం మంచి పద్దతి కాదన్నారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ(Idris Ali Modi).
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోల్ కతా లోని సిల్టా మెట్రో స్టేషన్ ను కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఈనెల 11న సోమవారం ప్రారంభించనున్నారు.
కానీ కేంద్ర ప్రభుత్వం కావాలని ప్రోటోకాల్ ను పాటించ లేదని ఆరోపించారు. కేంద్రంలో ఏ సర్కార్ ఉన్నా రాష్ట్రంలో జరిగే ప్రారంభోత్సవాలకు , కార్యక్రమాలకు, శంకుస్థాపనలకు తప్పనిసరిగా ముఖ్యమంత్రిని తప్పనిసరిగా ఆహ్వానం అందించాల్సి ఉందన్నారు.
కానీ కావాలని కేంద్ర సర్కార్ కక్షగట్టి, వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆహ్వానం అందలేదని ఆరోపించారు ఇద్రిస్ అలీ.
అంతే కాకుండా ఇటీవల రాష్ట్రంలో విక్టోరియా మెమోరియల్ లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ అమిత్ షా హాజరయ్యారని చెప్పారు. కానీ ఆ కార్యక్రమానికి కూడా సీఎం మమతా బెనర్జీని ఆహ్వానించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేంద్రంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్పారు. కానీ కావాలని పేరు చేర్చ లేదని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విభజన రాజకీయాల వల్ల ప్రధాని నరేంద్ర మోదకి కూడా శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే పడుతుందని సంచలన కామెంట్స్ చేశారు.
Also Read : మేధా పాట్కర్ పై కేసు నమోదు