Shashi Tharoor : ఆనందంగా ఉండాలంటే ప్రేమించాలి

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Shashi Tharoor Motivation : 137 ఏళ్ల సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ గా గుర్తింపు పొందారు తిరువ‌నంత‌పురం ఎంపీ , మాజీ కేంద్ర మంత్రి శ‌శి థ‌రూర్. ఆయ‌న వ‌క్త‌, మంచి ర‌చ‌యిత‌. అంత‌కంటే గొప్ప‌గా విశ్లేషించే నైపుణ్యం క‌లిగిన నాయ‌కుడు.

సోష‌ల్ మీడియాలో శ‌శి థ‌రూర్(Shashi Tharoor Motivation) నిత్యం చురుకుగా ఉంటారు. ఆయ‌న వాడే ఇంగ్లీష్ ప‌ద‌జాలం కోసం జ‌ర్న‌లిస్టులే కాదు మేధావులు సైతం విస్తు పోతారు. నిత్యం చ‌ద‌వ‌డం, రాయ‌డం, ఆలోచ‌న‌లు పంచుకోవ‌డం హాబీ. ఏ అంశంపైన నైనా కుండ బ‌ద్ద‌లు కొట్ట‌డం శ‌శి థ‌రూర్ కు అల‌వాటు. ఆయ‌న తాజాగా ఈశాన్య రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పార్టీ త‌ర‌పున ప్ర‌చారం లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా త‌న అభిమానులు, కార్య‌క‌ర్త‌లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను షేర్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆయ‌న చేసే ట్వీట్ కు భారీ ఎత్తున ఆద‌ర‌ణ ఉంటుంది. ఎందుకంటే చాలా లోతుగా విశ్లేషిస్తారు. గుంభ‌నంగా చుర‌క‌లు అంటిస్తారు. ఆపై వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ కేంద్రాన్ని, త‌న‌ను విమ‌ర్శించే వాళ్ల నోళ్లు మూయిస్తారు.

మీరు ఈ వ‌య‌స్సులో కూడా చ‌లాకిగా, సంతోషంగా ఉండేందుకు గ‌ల కార‌ణం ఏంటి..మీ స‌క్సెస్ సీక్రెట్ ఏంటి అంటే అడిగిన ప్ర‌శ్న‌కు శ‌శి థ‌రూర్ చాలా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తాను ఆనందంగా ఉండేందుకు ప్ర‌ధాన కార‌ణం ప్ర‌జ‌ల‌ను ప్రేమించ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. సో ఇప్పుడు ఆయ‌న చేసిన ఈ కామెంట్ వైర‌ల్ గా మారింది. ఎంతైనా శ‌శి థ‌రూరా(Shashi Tharoor) మ‌జాకా క‌దూ.

Also Read : రాహుల్ దేశానికి వ్య‌తిరేకం – జై శంక‌ర్

Leave A Reply

Your Email Id will not be published!