Satya Pal Malik : జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్(Satya Pal Malik) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. గత కొంత కాలం నుంచీ కేంద్ర సర్కార్ ను, ప్రధానంగా భారతీయ జనతా పార్టీని తప్పు పడుతూ వస్తున్నారు. ఇదే సమయంలో మోదీని, అమిత్ షాను పదే పదే ప్రస్తావిస్తూ హాట్ టాపిక్ గా మారారు.
ఇదే సమయంలో పుల్వామా దాడి ఘటపై సత్య పాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. పవర్ లో ఉన్నప్పుడు మాట్లాడకుండా గవర్నర్ గా దిగి పోయాక ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగానికి విరుద్దం కాదా అని నిలదీశారు.
దీనిపై సీరియస్ గా స్పందించారు సత్య పాల్ మాలిక్(Satya Pal Malik) . తాను ఇప్పటి వరకు నిజాయితీగా ఉన్నానని, ఏ ఒక్కరితో లాలూచీ పడలేదన్నారు. దేశం కోసం, ముఖ్యంగా అన్నం పెట్టే రైతులకు అన్యాయం జరగ కూడదని తాను మద్దతు ఇస్తూ వచ్చానని స్పష్టం చేశారు సత్య పాల్ మాలిక్. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను నిజాలు మాట్లాడుతూనే ఉంటానని మరోసారి సంచలన ప్రకటన చేశారు మాజీ గవర్నర్. మొత్తంగా ఆయన మరోసారి హాట్ టాపిక్ గా మారారు.
Also Read : ఆర్టిజన్ ఉద్యోగులకు బీఎస్పీ అండ