Congress Josh : కాంగ్రెస్ వైపు నేత‌ల చూపు

ఫ‌లిస్తున్న రేవంత్ రెడ్డి వ్యూహం

Congress Josh : తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా స‌రే ఈసారి కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి రావాల‌ని ప‌క్కా ప్లాన్ తో ముందుకు వెళుతోంది టీపీసీసీ. రేవంత్ రెడ్డి చీఫ్ అయ్యాక కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. స్త‌బ్దుగా ఉన్న పార్టీలో కొత్త జోష్ వ‌చ్చింది. క‌మిటీల ఏర్పాటు, పాద‌యాత్ర‌లు, స‌భ‌లు, స‌మావేశాలు, స‌మాలోచ‌న‌లు, స‌ద‌స్సుల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మ‌రో వైపు మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ గా పేరు పొందిన బీఆర్ఎస్ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ కు ధీటుగా ముందుకు వెళుతున్నారు. ఈ త‌రుణంలో ఇత‌ర పార్టీల నుంచి త‌మ పార్టీ వైపు తిప్పుకునేందుకు పావులు క‌దుపుతున్నారు రేవంత్ రెడ్డి.

పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుల‌ను క‌లుపుకుని పోతూనే మ‌రో వైపు ఆయా పార్టీల‌లో కీల‌క‌మైన నేత‌ల‌కు గాలం వేసే ప‌నిలో ప‌డ్డారు. ఒక ర‌కంగా రేవంత్ రెడ్డి బిగ్ స‌క్సెస్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికే ఎటు వైపు పోవాలో తెలియ‌క మీమాంస‌లో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణా రావు వ‌ద్ద‌కు తానే స్వ‌యంగా వెళ్లారు.

వారితో మాట్లాడారు. త‌మ పార్టీలో చేరాల‌ని ఆహ్వానించారు. అంతే కాదు పార్టీలోకి వ‌స్తే స‌ముచిత స్థానం ఇస్తామ‌ని హామీ కూడా ఇచ్చారు.. దీంతో వారు చేరిక దాదాపు ఖ‌రారై పోయిన‌ట్లే. ఇక తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి ముఖ్య‌మైన నేత‌లు 25 మందికి పైగా రాహుల్ గాంధీ స‌మక్షంలో ఖ‌మ్మంలో జ‌రిగే స‌భ‌లో చేర‌నున్న‌ట్లు స‌మాచారం. మొత్తంగా ఇప్పుడు గాలి కాంగ్రెస్ వైపు మ‌ళ్ల‌డంతో అంతా అటు వైపు చూస్తున్నారు.

Also Read : Pawan Kalyan : జ‌నం బాగుండాలంటే జ‌గ‌న్ పోవాలి

Leave A Reply

Your Email Id will not be published!