TPCC CBI : ఆ ఎమ్మెల్యేలకు కోలుకోలేని షాక్
టీపీసీసీ కీలక నిర్ణయంతో పరేషాన్
TPCC CBI : తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరొందినా చివరకు పవర్ లోకి రాలేక పోయింది కాంగ్రెస్ పార్టీ. దీనికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. తాజాగా ఆ పార్టీని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి కొంచెం దూకుడు పెంచారు. కానీ సీనియర్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న మాణిక్కం ఠాగూర్ కు చెక్ పెట్టింది. ఆయన స్థానంలో అపారమైన అనుభవం కలిగిన మరో సీనియర్ నాయకుడు మరాఠాకు చెందిన మాజీ మంత్రి మాణిక్ రావు ఠాక్రేను నియమించింది. ఈ తరుణంలో రాబోయే ఎన్నికలే టార్గెట్ గా తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది.
ఇదిలా ఉండగా తమ పార్టీ పేరుతో గెలుపొంది టీఆర్ఎస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ నుంచి బీ ఫామ్ ఫొంది ప్రజా ప్రతినిధులుగా 12 మంది ఎన్నికయ్యారు. వీరంతా పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నలుగురిలో ఉన్న వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన వారు కాగా ఒక్కరు మాత్రం గువ్వల బాల్ రాజు బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు అమ్ముడు పోవడం అలవాటేనని, వారి ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టాలని(TPCC CBI) కోరుతోంది.
రేగా కాంతా రావు, బీరం హర్షవర్దన్ రెడ్డి, పటేల్ రోహిత్ రెడ్డి ఉన్నారు. ఈ మేరకు సీబీఐకి లేఖ రాసింది విచారణ కోరుతూ.
Also Read : కిషన్ రెడ్డిపై కేటీఆర్ కన్నెర్ర