Revanth Reddy Arrest : ధర్నా ఉద్రిక్తం రేవంత్ రెడ్డి అరెస్ట్
పలు చోట్ల కాంగ్రెస్ నేతలు కూడా
Revanth Reddy Arrest : సర్పంచ్ లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, వారికి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్రమంతటా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను అదుపులోకి తీసుకున్నారు. ధర్నా చౌక్ వద్దకు కాకుండా ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy Arrest) ప్లాన్ చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఆయనను ఎక్కడికీ వెళ్లనీయలేదు.
కొంత సేపు గృహ నిర్బంధం చేశారు. అనంతరం బయటకు వచ్చిన రేవంత్ రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాను ఎంపీనని, జాతీయ పార్టీకి రాష్ట్ర చీఫ్ నని, ఏ ప్రాతిపదికన తనను అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.
తన ఇంటికి వచ్చి తనను అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు తిరిగేందుకు పర్మిషన్ లేదా అని నిలదీశారు. తాను ఇంట్లో నుంచి బయటకు రావాలంటే కూడా మీ పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy Arrest).
తన ఇంటికి వచ్చిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర పరిణామలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
సర్పంచ్ లకు రూ. 35 వేల కోట్లు దారి మళ్లించిన సీఎం కేసీఆర్ ను ముందుగా అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Also Read : నా ఫోన్ నే ట్యాపింగ్ చేస్తారా – ఆర్ఎస్పీ