Congress Bus Free : హ‌స్తం మ‌హిళ‌ల‌కు అభ‌య‌హ‌స్తం

కాంగ్రెస్ ప‌వ‌ర్ లోకి వ‌స్తే ఉచిత ర‌వాణా

Congress Bus Free : తెలంగాణ కాంగ్రెస్(Congress) పార్టీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. క‌ర్ణాట‌క ఫార్ములాను అనుస‌రిస్తోంది. ఈ మేర‌కు ఇటీవ‌ల ఆ రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో 224 సీట్ల‌కు గాను 135 సీట్లు గెలుపొందింది. అధికారంలోకి వ‌చ్చింది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా 5 గ్యారెంటీ హామీల‌ను ఇచ్చింది. అందులో కీల‌క‌మైన‌ది 20 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఆర్డిన‌రీ బ‌స్సుల‌లో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించింది. ఈ మేర‌కు త్వ‌ర‌లో తెలంగాణ రాష్ట్రంలో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ప్ర‌స్తుతం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా పార్టీ పావులు క‌దుపుతోంది. ఉచిత హామీలు గుప్పిస్తోంది. ఓ వైపు భార‌త రాష్ట్ర స‌మితి పాల‌న‌ను ఎండ‌గ‌డుతూనే మ‌రో వైపు ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేసే ప‌నిలో ప‌డింది. తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా టీపీసీసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌కు ఉచితంగా బ‌స్సు ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించింది. తాము ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది పార్టీ. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల‌కు పైగా ఖాళీలు ఉన్నా ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేయ‌లేద‌ని పార్టీ పేర్కొంది. తాము వ‌చ్చాక ప్ర‌తి పోస్టును భ‌ర్తీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. మొత్తంగా పార్టీ అభ‌య హ‌స్తం పేరుతో దుమ్ము రేపుతోంది.

Also Read : RGV Pawan Kalyan : గుర్తే లేని పార్టీ నుంచి సీఎం ఎలా

 

Leave A Reply

Your Email Id will not be published!