TPCC FEES : పోటీ చేయాలంటే ఫీజు కట్టాల్సిందే
టీపీసీసీ షాకింగ్ ప్రకటనతో పరేషాన్
TPCC FEES : త్వరలో తెలంగాణలో శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగుతోంది. బరిలోకి దిగేందుకు ఆశావాహులు రెడీ అవుతున్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల్లో పోటీ చేసే వారి సంఖ్య ఎక్కువైంది. దీంతో తాజాగా కీలక ప్రకటన చేసింది టీపీసీసీ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎవరైనా పోటీ చేయాలని అనుకుంటే ముందుగా రూ. 50 వేలు కట్టాలని స్పష్టం చేసింది. వారికే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.
TPCC FEES Will be Charged if Anyone Joins
ఇందులో భాగంగా కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 18 నుండి 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది టీపీసీసీ(TPCC FEES). ఓసీ కులానికి చెందిన వారు అభ్యర్థులుగా పోటీ చేయాలని అనుకుంటే రూ. 50 వేలు చెల్లించాలని , అదే వెనుకబడిన తరగతులకు చెందిన వారైతే రూ. 25 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని కుండ బద్దలు కొట్టింది.
టీపీసీసీ చేసిన తాజా ప్రకటనతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావహులు , ముఖ్య నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం రాజకీయం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే డబ్బులు లేక నానా తంటాలు పడుతుంటే ఫీజు పేరుతో నిబంధన పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా పార్టీ చేసిన ఈ కీలక ప్రకటన మిగతా పార్టీలకు కూడా పాకే ప్రమాదం పొంచి ఉంది.
Also Read : TTD Chairman Bhumana : ఆపరేషన్ చిరుత కొనసాగిస్తాం