CM Himachal Pradesh : సీఎం సింగ్ కు గ్రాండ్ వెల్ కమ్
జడ్చర్ల బహిరంగ సభకు హాజరు
CM Himachal Pradesh : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయాన్ని సాధించింది. 224 సీట్లకు గాను 135 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో వైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో హోరెత్తిస్తున్నారు.
ఇప్పటికే 800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు భట్టి. ప్రస్తుతం ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాత్ర కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం జడ్చర్ల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి(CM Himachal Pradesh) సుఖ్వీందర్ సింగ్ . హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న సీఎంకు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ , రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ , తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక బహిరంగ సభకు హైలెట్ గా నిలిచారు ప్రజా యుద్ద నౌక గద్దర్.
Also Read : TDP Mahanadu