Trains Flights Cancel : ఏపీలో రైళ్లు..విమానాలు ర‌ద్దు

మిచౌంగ్ తుపాను ప్ర‌భావం

Trains Flights Cancel : అమ‌రావతి – బంగాళా ఖాతంలో ఏర్ప‌డిన అల్ప పీడ‌నం వాయుగుండంగా మారింది. ఇది తుపానుగా మారింది. ఇటు ఆంధ‌ప్రదేశ్ తో పాటు అటు త‌మిళ‌నాడు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి.

Trains Flights Cancel due to Cyclone

ప్ర‌స్తుతం మిచౌంగ్ తుపాను ప్ర‌భావం కార‌ణంగా పెద్ద ఎత్తున విమానాలతో పాటు రైళ్లు ర‌ద్ద‌య్యాయి. ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే గ‌న్న‌వ‌రం నుంచి న‌డిచే 15 విమాన స‌ర్వీసుల‌ను పూర్తిగా నిలిపి వేశారు. ఇందులో భాగంగా ఏపీలోని(AP) విశాఖ ప‌ట్నం, చెన్నై , హైద‌రాబాద్ , బెంగ‌ళూరు, షిర్డీ , క‌డ‌ప , ఢిల్లీ న‌గ‌రాల‌కు వెళ్లే విమానాలు ర‌ద్దు చేశారు.

ఇక విశాఖ నుంచి వెళ్లాల్సిన 23 విమాన స‌ర్వీసుల‌ను నిలిపి వేశారు. దీంతో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శాఖ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. ఇదిలా ఉండ‌గా మిచౌంగ్ తుపాను కార‌ణంగా విశాఖ‌లో బీచ్ లు మూసి వేశారు. ఆర్కే బీచ్ లో పోలీసులు ప్ర‌త్యేకంగా పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. అన్ని బీచ్ ల వ‌ద్ద ఖాకీలు ప‌ర్య‌వేక్ష‌ణ చేప‌ట్టారు. ప‌ర్యాట‌క‌లు రాకుండా ఆంక్ష‌లు విధించారు.

Also Read : Mallikarjun Kharge : ఇవాళే సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తాం

Leave A Reply

Your Email Id will not be published!