Umesh Pal Mother : అస‌ద్ హ‌త్య నా కొడుకుకు నివాళి

యూపీ సీఎం యోగికి ధ‌న్య‌వాదాలు

Umesh Pal Mother : గ‌త ఫిబ్ర‌వ‌రి నెల‌లో హ‌త్య‌కు గురైన న్యాయ‌వాది ఉమేష్ పాల్ త‌ల్లి శాంతి దేవి(Umesh Pal Mother) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. క‌ర‌డుగట్టిన నేర‌స్థుడు మాజీ ఎంపీ అతీక్ అహ్మ‌ద్ త‌న‌యుడుతో పాటు గులాంను ఇవాళ యూపీ పోలీసులు ఎన్ కౌంట‌ర్ లో కాల్చి చంపారు. రాష్ట్రంలో ఈ ఘ‌ట‌న క‌లక‌లం రేపింది. ఈ సంద‌ర్భంగా న్యాయ‌వాది త‌ల్లి తీవ్రంగా స్పందించారు.

ఇది స‌రైన నివాళిగా ఆమె పేర్కొన్నారు. న్యాయం చేసినందుకు రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యా నాథ్ కు ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని అన్నారు. మున్ముందు కూడా త‌మ‌కు న్యాయం చేయాల‌ని ఆమె కోరారు. సీఎంపై త‌మ‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని చెప్పారు శాంతి దేవి.

త‌మ విధుల‌ను నిర్వ‌హించిన పోలీసుల‌కు కూడా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఉమేష్ పాల్ హ‌త్య కేసులో వాంటెడ్ గా ఉన్న అసద్ తో పాటు అత‌ని స‌హ‌చ‌రుడు గులామ్ ను యూపీ స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ జాన్సీలో ఎన్ కౌంట‌ర్ చేశారు.

ఉమేష్ పాల్(Umesh Pal) భార్య జ‌య దేవి కూడా సీఎంకు థ్యాంక్స్ చెప్పారు. ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న సీఎంకు ఎలా చెప్పాలో అర్థం కావ‌డం లేద‌న్నారు. త‌న కూతురి భ‌ర్త‌ను హ‌త్య చేసిన హంతకుల‌కు శిక్ష విధించారు. ఇదే న్యాయం..ఇలాంటి సీఎం ఉండ‌డం త‌మ అదృష్ణ‌మ‌న్నారు.

Also Read : పంజాబ్ లో అమృత్ పాల్ పోస్ట‌ర్లు

Leave A Reply

Your Email Id will not be published!