Pranab Mukherjee : ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి ఘ‌నంగా నివాళి

13వ రాష్ట్ర‌ప‌తిగా ప‌ని చేశారు

Pranab Mukherjee :  భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ వ‌ర్ధంతి ఇవాళ‌. అజాత శ‌త్రువుగా పేరొందారు. రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా ఘ‌నంగా నివాళులు అర్పించారు.

అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ముఖ్య‌మైన నాయ‌కులులో ఒక‌రిగా పేరొందారు. ఆనాటి ఇందిరా గాంధీ నుండి సోనియా గాంధీ వ‌ర‌కు అనేక మంది నాయ‌కుల‌తో క‌లిసి ప‌ని చేశారు.

పార్టీకి సంబంధించి కీల‌క‌మైన స‌మ‌యాల‌లో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ(Pranab Mukherjee)  ట్ర‌బుల్ షూట‌ర్ గా నిలిచారు. ఆయ‌న‌ను అంతా ప్ర‌ణ‌బ్ దా అని పిలిచే వారు ఆనాడు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కూడా ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

భార‌త దేశానికి 13వ రాష్ట్ర‌ప‌తిగా ప‌ని చేశారు. ప్ర‌ణ‌బ్ దాది రెండో వ‌ర్దంతి. పార్టీల‌కు అతీతంగా అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారు, ప‌రిచ‌యం ఉన్న వారు నివాళులు అర్పించారు.

ఇదిలా ఉండ‌గా 2011 నుండి 2017 మధ్య దేశానికి రాష్ట్ర‌ప‌తిగా ప‌ని చేశారు. ఈ సంద‌ర్భంగా ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని గుర్తు చేసుకున్నారు.

ఆయ‌న అరుదైన రాజ‌కీయ నాయ‌కుడంటూ కితాబు ఇచ్చారు. కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరి ప్ర‌ణ‌బ్ తో దిగిన చిత్రాల‌ను పంచుకున్నారు.

ప్ర‌జా జీవితానికి, దేశానికి ఆద‌ర్శ ప్రాయ‌మైన సేవ‌కు, ద్వైపాక్షిక రాజ‌కీయాల‌కు, రాజ‌నీతిజ్ఞ‌త‌కు చేసిన కృషికి ఎప్ప‌టికీ గుర్తుండి పోతాయ‌ని పేర్కొన్నారు.

దేశానికి ఆయ‌న చేసిన ప్ర‌శంసీన‌య‌మ‌ని కాంగ్రెస్ పార్టీ స్మ‌రించుకుంది. త‌న సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ప్ర‌జా జీవితాన్ని లోతుగా ప్ర‌భావితం చేసిన గొప్ప వ్య‌క్తి అంటూ గుర్తు చేసుకున్నారు అస్సాం సీఈఎం హిమంత బిస్వా శ‌ర్మ‌.

రాజ్యాంగ విలువ‌లు, దేశ పురోగ‌తి ప‌ట్ల నిబ‌ద్ద‌త క‌లిగిన నేత‌గా ఎప్ప‌టికీ గుర్తుండి పోతార‌ని రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.

Also Read : భార‌త ఎకాన‌మీకి ఢోకా లేదు – చైర్మ‌న్

Leave A Reply

Your Email Id will not be published!