Bengal Assembly : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఇవాళ అట్టుడికింది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బెంగాల్ రాష్ట్రంలోని బీర్బూమ్ లో చోటు చేసుకున్న సజీవ దహనం ఘటనపై అసెంబ్లీ (Bengal Assembly)దద్దరిల్లింది.
ఈ ఘటనకు పూర్తి బాధ్యత టీఎంసీదేనంటూ బీజేపీ సభ్యులు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
దీంతో స్పీకర్ ఎంత చెప్పినా వినిపించుకోక పోవడంతో ప్రతిపక్ష నేత సువేంద్ అధికారితో పాటు మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడాలంటూ విపక్ష సభ్యులు పట్టుప్టారు. దీంతో అధికార పార్టీకి చెందిన టీఎంసీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యేలు వినిపించుకోక పోవడంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా తనపై దాడికి సువేంద్ అధికారి పాల్పడ్డాడంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అసిత్ మజుందార్(Bengal Assembly) ఆరోపించారు.
ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో స్పీకర్ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది అంతా అసెంబ్లీలో పాల్గొనకుండా సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా అసెంబ్లీ లోపల ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయింది. కనీసం తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలపై కొంత మంది టీఎంసీ ఎమ్మెల్యేలు దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు సువేందు అధికారి.
అయితే టీఎంసీ మంత్రి ఫిర్హాద్ హకీమ్ మాత్రం బీజేపీపై నిప్పులు చెరిగారు. సభలో తమ ఎమ్మెల్యేలు గాయపడ్డారని ఆరోపించారు.
Also Read : గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణం