Tripura TMC : త్రిపుర‌లో రాబోయే కాలం మాదే

తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ

Tripura TMC : త్రిపుర ముఖ్య‌మంత్రి బిప్ల‌బ్ దేబ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. బీజేపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, ఆధిప‌త్య పోరు వెర‌సి సీఎం అస‌మ‌ర్థ పాల‌న త‌నంత‌కు తానుగా త‌ప్పుకునేలా చేశాయ‌ని టీఎంసీ(Tripura TMC) ఆరోపించింది.

మొత్తంగా సీఎంను మార్చినా త్రిపుర భ‌విత‌వ్యం మార‌ద‌ని పేర్కొంది టీఎంసీ. ప‌శ్చిమ బెంగాల్ లో అద్భుత విజ‌యాన్ని సాధించిన అనంత‌రం ఆ పార్టీ గోవా, ఉత్త‌ర ప్ర‌దేశ్ తో పాటు త్రిపుర‌లో కూడా పాగా వేసేందుకు పావులు క‌దుపుతోంది.

ఈ త‌రుణంలో ప‌లు ఘ‌ర్ష‌ణ‌లు కూడా చోటు చేసుకున్నాయి టీఎంసీ, బీజీపీల మ‌ధ్య‌. టీఎంసీ(Tripura TMC) చీఫ్‌, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ త్రిపుర‌పై ఫోక‌స్ పెట్టారు.

ఆయ‌న పలుసార్లు త్రిపుర‌ను చుట్టు ముట్టారు. అక్క‌డ పార్టీ బ‌లోపేతంపై మ‌రింత శ్ర‌ద్ద తీసుకుంటున్నారు. ఏడాది త‌ర్వాత త్రిపుర‌లో అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ త‌రుణంలో సీఎం బిప్ల‌బ్ దేబ్ రాజీనామా చేయ‌డం టీఎంసీకి మ‌రింత అవ‌కాశం క‌ల్పించిన‌ట్ల‌యింది. రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని, దీనికి సీఎం,

పార్టీ హైక‌మాండ్ కార‌ణ‌మ‌ని టీఎంసీ ఎద్దేవా చేస్తోంది. మార్పు అనివార్యమ‌ని, దానికి తామే ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండ‌గ‌లుగు తామ‌ని టీఎంసీ(Tripura TMC) అంటోంది.

ఆ మేర‌కు పావులు క‌దిపేందుకు ఇప్ప‌టి నుంచే స‌న్నాహాలు మొద‌లు పెట్టింది. సీఎం రాజీనామాతో ఒక్క‌సారిగా బీజేపీలో ఉలుకు మొదలైంద‌ని టీఎంసీ పేర్కొంది.

కాగా టీఎంసీకి త్రిపుర‌లో అంత సీన్ లేదంటోంది కాషాయ ద‌ళం. మొత్తంగా సీఎం రాజీనామాతో ఒక్క‌సారిగా త్రిపుర వేడెక్కింది.

Also Read : యువ నాయ‌క‌త్వంపై కాంగ్రెస్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!