Barnali Goswami Attack : త్రిపుర మహిళా కమిషన్ చీఫ్ పై దాడి
సంచలన ఆరోపణలు చేసిన బర్నాలీ గోస్వామి
Barnali Goswami Attack : త్రిపుర భారతీయ జనతా పార్టీలో కలకలం రేపారు రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ పై దాడి. స్వయంగా తనపై బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించింది కమిషన్ చైర్ పర్సన్ బర్నాలీ గోస్వామి. పొరుగు వారిని కలిసేందుకు వెళ్లిన తనపై దాదాపు 200 మంది మహిళలు, పురుషులు దాడికి(Barnali Goswami Attack) పాల్పడ్డారంటూ వాపోయారు.
విచిత్రం ఏమిటంటే స్వయంగా ఆమె బీజేపీకి చెందిన నాయకురాలు కావడం విశేషం. దాడి చేసిన వారిలో కొందరు బీజేపీ కౌన్సిలర్లు కూడా ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. త్రిపురలోని ధామ్ నగర్ లో దాడికి పాల్పడ్డారంటూ ఆమె స్వయంగా ఆరోపించారు. ఈ దాడిలో నేను తీవ్రంగా గాయపడ్డాను. దాడికి పాల్పడిన వారు అమానుషంగా ప్రవర్తించారు.
ఆపై నా చీర, ఇతర దుస్తులను చింపి వేశారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు త్రిపుర మహిళా కమిషన్ చైర్ పర్సన్ బర్నాలీ గోస్వామి(Barnali Goswami Attack). అనేకసార్లు తాను ఫోన్ చేసినా పోలీసులు స్పందించ లేదని ఆరోపించారు. వాళ్లు సాయం కూడా చేయలేదంటూ మండిపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించి మహిళా కమిషన్ చీఫ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు త్రిపుర సీఎం డాక్టర్ మాణిక్ సాహాకు సమాచారం అందించారు. ఈ దాడి ఘటనలో ఆమెతో పాటు అంగరక్షకుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉండగా గోస్వామికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ టికెట్ నిరాకరించింది.
దీంతో ఆమె ధమ్ నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీకి చెందిన బస్వా బంధు సేన్ కు వ్యతిరేకంగా పని చేయడం ప్రారంభించిందని సమాచారం.
Also Read : కేరళ..కర్ణాటకలో ఎన్ఐఏ దాడులు