Amit Shah : గుజరాత్ ఎన్నికలపై ‘ట్రబుల్ షూటర్’ ఫోకస్
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సీఈసీ
Amit Shah : కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రంగంలోకి దిగారు ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah). రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు చేపట్టనుంది సీఈసీ. నవంబర్ 6న ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ప్రచారం చేపట్టనున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో మరోసారి పవర్ లోకి వచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. 2017లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండగా ఈసారి కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చేరింది. దీంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికలకు ప్రాధాన్యత పెరిగింది. త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి.
ఎవరి ఓటు బ్యాంకు చీలుతుందనేది వేచి చూడాలి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 27 ఏళ్లుగా కంటిన్యూగా భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగుతూ వస్తోంది. గుజరాత్ అంటేనే నరేంద్ర మోదీ(PM Modi). మోదీ అంటేనే గుజరాత్ అనేంతగా తన పట్టు నిలుపుకున్నారు.
ఇప్పటికే ఆప్ ప్రచారంలో మునిగి పోగా తన పార్టీ తరపున సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈసారి గుజరాత్ లో కాషాయానికి అధికారం కట్టబెట్టే బాధ్యతను తానే భుజాల పైకి వేసుకున్నారు అమిత్ చంద్ర షా. ఆయా నియోజకవర్గాలలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై సమీక్షించారు.
ఆయన ఇప్పటికే రాష్ట్రాన్ని జల్లెడ పట్టారు. గత రెండు నెలల్లో 16 రోజులు గడిపారు. 45 బహిరంగ సభల్లో ప్రసంగించారు. సీఈసీ షెడ్యూల్ ప్రకటించిన సమయంలో అమిత్ షా అహ్మదాబాద్ లో ఉన్నారు. పార్టీ నేతలతో సమీక్ష చేపట్టారు.
Also Read : ప్రచారం ఎక్కువ పని తక్కువ – నితీశ్