Vijaya Reddy : ‘గులాబీ’కి గుడ్ బై ‘హస్తాని’కి జై
మళ్లీ కాంగ్రెస్ గూటికి విజయా రెడ్డి
Vijaya Reddy : దివంగత నాయకుడు, పేదల పెన్నిధిగా పేరొందిన పి. జనార్దన్ రెడ్డి కూతురు విజయా రెడ్డి (Vijaya Reddy) తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పనున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆమె టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
ఆయన నివాసంలో గంటకు పైగా చర్చలు జరిపారు. ప్రస్తుతం విజయా రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున కార్పొరేటర్ గా ఉన్నారు. ఈ మేరకు తాను అక్కడ ఇముడ లేక పోతున్నానని, తట్టుకోలేక పోతున్నానని వాపోయారు.
ఇందులో భాగంగా తాను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని అనుకుంటున్నట్లు రేవంత్ రెడ్డితో చెప్పారు. జనార్దన్ రెడ్డి చని పోయేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.
ఆయన ప్రజల పక్షాన తన గొంతు వినిపించారు. ఈ మేరకు విజయా రెడ్డిని(Vijaya Reddy) పార్టీలోకి వస్తానంటే తమకు అభ్యంతరం లేదన్నారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం విజయా రెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కోసం పి. జనార్దన్ రెడ్డి ఎంతో చేశారు.
కాంగ్రెస్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. చాలా రోజులుగా రేవంత్ రెడ్డి అన్నతో చర్చలు జరుపుతూ వచ్చా. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్.
ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీలో వేరే వ్యక్తులు కొనసాగే పరిస్థితులు లేవన్నారు విజయా రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ పార్టీకి ప్రత్యామ్నాయం ఒక్క కాంగ్రెస పార్టీనేనని ఆమె స్పష్టం చేశారు.
మొత్తంగా ఆమె రావడంతో శ్రవణ్ పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
Also Read : రాకేశ్ కుటుంబానికి కేసీఆర్ భరోసా