TRS MLAs Case : ఎమ్మెల్యేల కేసులో ఖాకీలకు బిగ్ షాక్
ఆ ముగ్గురు నిందితుల్ని విడుదల చేయండి
TRS MLAs Case : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు(TRS MLAs Case) గువ్వల బాల రాజు, హర్షవర్దన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, కాంతారావుల కొనుగోలు కథ. ఈ వ్యవహారం మరింత హీటు పెంచేలా చేసింది. కేసుకు సంబంధించి సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. కోట్ల రూపాయలు ఎరగా చూపారని అన్నారు .
కానీ ఆధారాలు చూపించ లేక పోయారు. ఇదే సమయంలో మోయినాబాద్ ఫామ్ హౌజ్ లో పట్టుబడిన ఆ ముగ్గురు నిందితులను కోర్టులో హాజరు పరిచిన ఖాకీలకు కోలుకోలేని షాక్ తగిలింది. కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ కోర్టు సీరియస్ గా స్పందించింది. నిందితులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు జడ్జి.
సరైన ఆధారాలు లేవని మండిపడ్డారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ పీసీ యాక్ట్ ఈ కేసులో వర్తించదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకు ఎర వేశారని చెబుతున్న పోలీసులకు అందుకు సంబంధించిన డబ్బులు ఎక్కడున్నాయో చూపించ లేక పోయారంటూ సీరియస్ అయ్యారు న్యాయమూర్తి.
ఇదే సమయంలో 41 సీఆర్ పీసీ నోటీసు ఇచ్చి విచారించవచ్చని స్పష్టం చేశారు. రామచంద్ర భారతి, నంద కుమార్ , సింహయాజి స్వామిలను న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా తప్పు పట్టారు జడ్జి. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు సీపీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు.
ఫామ్ హౌజ్ పై దాడి చేయడంతో ఆ ముగ్గురు పట్టుబడ్డారు. పార్టీ ఫిరాయిస్తే రూ. 100 కోట్లు ఇస్తామని తమకు చెప్పారంటూ తెలిపారు ఎమ్మెల్యేలు. కాగా మునుగోడులో ఓటమి భయంతోనే ఇలాంటి చిల్లర నాటకానికి తెర లేపాడంటూ సీఎంపై మండిపడ్డారు బీజేపీ నేతలు.
Also Read : బీజేపీ నేతల మాటలన్నీ బక్వాస్ – కేటీఆర్