Bandi Sanjay Resign : బండి సంజ‌య్ రాజీనామా

తెలంగాణ బీజేపీకి గుడ్ బై

Bandi Sanjay Resign : కేంద్రంలో బీజేపీ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ప‌లు రాష్ట్రాల బీజేపీ చీఫ్ ల‌ను మార్చింది. తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు బండి సంజ‌య్ . గ‌త కొన్ని రోజుల నుంచి ఆయ‌న త‌ప్పుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది. మంగ‌ళ‌వారం ఇందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఆయ‌న స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న గంగాపురం కిష‌న్ రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది హైక‌మాండ్.

బండి సంజ‌య్ క‌రీంన‌గ‌ర్ ఎంపీగా ఉన్నారు. ఆయ‌న వ‌చ్చాక రాష్ట్రంలో బీజేపీ జోష్ పెరిగింది. ఉప ఎన్నిక‌ల్లో, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటింది. హిందూ ఓటు బ్యాంకును ప‌దిలంగా బీజేపీ వైపు తిప్పేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు బండి సంజ‌య్(Bandi Sanjay). త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో పార్టీ ప‌రంగా కొంత మార్పులు అవ‌స‌ర‌మ‌ని పార్టీ భావించింది.

ఆ మేర‌కు అంద‌రికీ ఆమోద యోగ్య‌మైన నాయ‌కుడిగా కిష‌న్ రెడ్డినే ప్రిఫెర్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇక పార్టీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న బండి సంజ‌య్ కు పార్టీ హై క‌మాండ్ కేంద్ర ప‌ద‌వి ఆఫర్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. అటు తెలంగాణ‌తో పాటు ఏపీ బీజేపీ చీఫ్ పై కూడా వేటు వేసింది.

అంత‌కు ముందు బీజేపీ స్టేట్ చీఫ్ గా ల‌క్ష్మ‌ణ్ ఉన్నారు. ఆయ‌న స్థానంలో వ‌చ్చారు బండి సంజ‌య్.

Also Read : PM Modi : పాకిస్తాన్ కు భార‌త్ వార్నింగ్

 

Leave A Reply

Your Email Id will not be published!