TS Cabinet Meeting : మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ
40 నుంచి 50 అంశాలపై చర్చించే ఛాన్స్
TS Cabinet Meeting : భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి సోమవారం కీలక సమావేశం జరగనుంది(TS Cabinet Meeting). త్వరలోనే రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కొనసాగుతోంది. పార్టీ చీఫ్ , రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆధ్వర్యంలో దిశా నిర్దేశం చేశారు. ప్రజా ప్రతినిధులు తమ తమ నియోజకవర్గాలలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఈ ఆరు నెలలు పార్టీకి, ప్రభుత్వానికి అత్యంత కీలకమని హెచ్చరించారు.
TS Cabinet Meeting Today
ఈ నేపథ్యంలో ఇవాళ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్ లో కీలకమైన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ మీటింగ్ లో ఏం నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 40 నుంచి 50 అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి తీపి కబురు చెప్పనున్నట్లు టాక్. రాబోయే ఎన్నికల్లో వారే కీలకం. ఏ మాత్రం వారి కోర్కెలలో కనీసం కొన్నింటినైనా తీర్చలేక పోతే కష్టంగా ఉంటుందని భావిస్తున్నారు. మరో వైపు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిన రాష్ట్రంలో 2 లక్షల మందికి పైగా పని చేస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించడమా లేక జీతాలు పెంచడమా అన్నది చూడాలి. వీటితో పాటు ఇంకా పలు అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్.
Also Read : Dil Raju Elected : టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా దిల్ రాజు