Congress MP’S : తెలంగాణ – కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ను ప్రవేశ పెట్టింది. లోక్ సభలో 545 మంది ఎంపీల సభ్యులకు గాను 456 మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఇంతియాజ్ జలీల్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
Congress MP’S Viral
ఈ విషయాన్ని వారు కూడా ధ్రువీకరించారు. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు భారతీయ జనతా పార్టీ ఎంపీలు, మంత్రులు. తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఇప్పటికే మహిళా బిల్లుకు తమ పార్టీ మద్దతు తెలిపినట్లు స్పష్టం చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ. ఆమె తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఉండడం ఇప్పుడు విస్తు పోయేలా చేసింది.
ఓ వైపు మహిళల అభివృద్ది సంక్షేమమే తమ లక్ష్యం అంటూ బీరాలు పలుకుతున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy), భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లు అత్యంత ప్రతిష్టాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓటు వేయలేదని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read : Nara Lokesh : జగన్ పై లోకేష్ షాకింగ్ కామెంట్స్