TS DGP Anjani Kumar : శభాష్ తెలంగాణ పోలీస్ – డీజీపీ
భూపాలపల్లి సీఐ, ఎస్సైలకు సలాం
TS DGP Anjani Kumar : వాయుగుండం గండంగా మారింది. ఇరు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున కుండ పోతగా కురుస్తున్న వర్షాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గోదావరి, కృష్ణా నది పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఓ వైపు భద్రాచలం మరోవైపు ప్రకాశం బ్యారేజ్ కు నీళ్లు పోటెత్తాయి. ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలు నీట మునిగేలా చేశాయి.
TS DGP Anjani Kumar Appreciates
గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణను వర్షాలు ముంచెత్తాయి. నీళ్లలో మునిగేలా చేశాయి. ఉమ్మడి వరంగల్ , ఖమ్మం జిల్లాలను వరద ఉధృతి పోటెత్తింది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ , అగ్ని, రాష్ట్ర పోలీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
తాజాగా గల్లంతయిన మృత దేహాలను తీసుకునేందుకు స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ తరుణంలో భూపాలపల్లి సీఐ నరసింహా రెడ్డి, చిట్యాల ఎస్ఐ రమేష్ , సిబ్బంది, స్థానికులతో కలిసి మృత దేహాలను మోశారు.
నీళ్లు తగ్గుముఖం పట్టడంతో అనేక చోట్లన్నీ బురదమయం అయ్యాయి. అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని తరలించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ సందర్భంగా సీఐ, ఎస్ఐలను అభినందించారు తెలంగాణ పోలీస్ డీజీపీ అంజనీ కుమార్(TS DGP Anjani Kumar). ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వం కాదా అని ప్రశ్నించారు డీజీపీ.
Also Read : MP Sanjay Singh : సస్పెండ్ చేసినా పోరాటం ఆపను