Governor Tamilsai : ముంపు బాధితుల గోస గ‌వ‌ర్న‌ర్ భ‌రోసా

బాధితుల‌ను చూసి చ‌లించిన త‌మిళిసై

Governor Tamilsai : గ‌తంలో ఏ గ‌వ‌ర్న‌ర్ కూడా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు. కానీ త‌మిళ‌నాడుకు చెందిన త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మితులైన త‌ర్వాత చాలా మార్పులు తీసుకు వ‌చ్చారు.

ప్ర‌జ‌లు త‌మ బాధ‌ల‌ను తెలియ చేసుకునేందుకు గాను ప్ర‌జా ద‌ర్బార్ ఏర్పాటు చేశారు. ఆమె కొలువు తీరాక క‌రోనా క‌ష్ట కాలంలో సీఎం బ‌య‌ట‌కు రాక పోయినా ఆమె ఆస్ప‌త్రుల‌ను సంద‌ర్శించారు.

వారంద‌రికీ భ‌రోసా క‌ల్పించారు. తాజాగా నైరుతి రుతు ప‌వ‌నాల ప్ర‌భావం కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేశాయి. ఓ వైపు సీఎం కేసీఆర్ భ‌ద్రాచలం జిల్లాలో విస్తృతంగా ప‌ర్యటించారు.

ఈ సంద‌ర్భంగా వ‌ర‌ద బాధితుల‌కు రూ. 10 వేలు ఇస్తామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా మ‌రో వైపు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ సైతం ప‌ర్య‌టించ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది.

ఆమె రైలు మార్గం ద్వారా భ‌ద్రాచ‌లంకు చేరుకున్నారు. కాగా సీఎం కేసీఆర్ మాత్రం ఫ్లైట్ లో వెళ్లారు. ఏరియ‌ల్ స‌ర్వే చేప‌ట్టారు. ప్రోటోకాల్ ప్ర‌కారం ఎస్పీ, క‌లెక్టర్ హాజ‌రు కావాల్సి ఉండ‌గా డుమ్మా కొట్టారు.

సీఎం వ‌ద్ద క‌నిపించారు. త‌మిళి సై(Governor Tamilsai) బాధితుల‌కు మందులు పంపిణీ చేశారు. అశ్వాపురం మండ‌లంలోని పాముల‌ప‌ల్లి, భట్టిల‌గుంపు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప‌రిశీలించారు.

అనంత‌రం కొత్త‌గూడెం జిల్లాలో ప‌ర్య‌టించారు. నీట మునిగిన పొలాల‌ను చూశారు. బాధితుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. వ‌ర‌ద బాధితుల‌ను చూసి గ‌వ‌ర్న‌ర్ చ‌లించి పోయారు.

Also Read : అంగ‌రంగ వైభ‌వం బోనాల సంబరం

Leave A Reply

Your Email Id will not be published!